మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ పై పులి దాడి
चंद्रपुर Tak
చంద్రపూర్ : పోంబూర్జ తాలూకాలోని వెడవ గ్రామానికి చెందిన సంధ్య బావనే ( 35 ) ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆమె పై పులి దాడిచేసి హతమార్చింది.
దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ఘటన గురువారం ఉదయం జరి గింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలిలా. భర్త చని పోవడంతో సంధ్య భావనే అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో వెడవ గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రోజూ మాదిరి గానే గురువారం పోంబూర్ల వెడవ మార్గంలో ఉదయపు నడక చేస్తుండగా వంతెన వద్ద మాటువేసిన పులి ఆమెపై దాడిచేసి హతమార్చింది.
రహదారిన వెళ్లేవారు కొందరు ఈ దృశ్యాన్ని చూసి గట్టిగా అరిచి పులిని వెంబడించారు. దాంతో పులి మృత దేహాన్ని నోటకరచుకొని రహదారి పక్కనే ఉన్న పొలంలో వదిలి పారిపోయింది. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారి అమ్రపాలి కోబ్రా గడే, ఉపవిభాగీయ పోలీసు అధికారి మల్లికార్జున్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులిని బంధించేవరకు మృతదే హాన్ని కదిలించేందుకు గ్రామస్థులు ససేమిరా అంటూ రోడ్డుపైనే బైఠాయించారు. ఎట్టకేలకు త్వరలోనే పులిని బంధిస్తామని గ్రామ స్థులకు హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం పోంబూర్ణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పులి దాడిలో సంధ్య మృతి చెందడంతో కుమార్తె ( 13 ), కుమారుడు ( 11 ) తల్లిదండ్రులు లేక ఒంటరివారయ్యారు.

