చంద్రపూర్ | హెల్నెట్ లేని పోలీసు.. జరిమానా తప్పదు బాసు
चंद्रपुर Tak
శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహన పోలీసుకు దండన విధిస్తున్న ట్రాఫిక్ పోలీసు
చంద్రపూర్ : జిల్లాలో శిరస్త్రాణం ( హెల్మెట్ ) ధరించని 17 మంది పోలీసులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు జిల్లా ట్రాఫిక్ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ పాటిల్ ఆదివారం తెలిపారు. పక్షం రోజులుగా జరిగిన ప్రమాదాల్లో అధికశాతం హెల్మెట్ ధరించకపోవడంతో తలకు గాయాలై ప్రాణాలు కోల్పొయిన వారు ఉన్నట్లు వెల్లడైందన్నారు.
దీంతో జిల్లాలో దశలవారీగా హెల్మెట్ తప్పనిసరి చేయాలని తలంచారు. ఈ నిబంధనను తొలుత జిల్లాలో ద్విచక్రవాహనం వాడుతున్న పోలీసులకు తప్పని సరి చేశారు.
అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు, తరువాత ప్రజలకు తప్పనిసరి చేయనున్నారు .
