చంద్రపూర్ : మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా ఉథడ్ పేట్ గ్రామ రైతు వామన్ కిన్నాకే. ఊరికి సమీపంలోనే ఉన్న పొలంలో కూరగాయలు సాగుచేస్తున్నారు.

గురువారం కోతలు మొదలు పెట్టారు. కోసిన బీరకాయలను పొలంలోనే ఉన్న ట్రేలో వేసే క్రమంలో దానిపై కప్పిన గోతాన్ని తీయగా చిరుతపులి కూన కన్పిం చడంతో అవాక్కయ్యారు. అటవీశాఖ అధి కారులకు సమాచారమిచ్చారు. చిచ్పల్లి అటవీ శాఖ అధికారి దాన్ని చంద్రపూర్కు తరలించారు.

ఈ కను సుమారు మూడున్నర నెలల వయసు ఉంటుందని వెల్లడించారు. దాన్ని చూసేందుకు గ్రామ స్థులు తరలివచ్చారు.